ఇనుగుర్తి, డిసెంబర్ 22 : ఇనుగుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై బిహార్‌కు చెందిన వలస కూలీ లైంగికదాడికి యత్నించిన ఘటన సోమవారం జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ మహిళ తన వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటున్నది. పక్కనే ఉన్న ఓ రైస్ మిల్లులో పనిచేసే బిహార్ కూలీ మద్యం మత్తులో ఆ మహిళపై లైంగికదాడికి యత్నించాడు. నిందితుడి నుంచి తప్పించుకొని రోడ్డు మీదకు వచ్చిన ఆమె స్థానికులకు విషయం తెలియజేసింది. వారి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను 108లో మహబూబాబాద్‌లోని ఏరియా దవాఖానకు తరలించారు.
స్థానికులు చుట్టుపక్కల గమనించగా తప్పతాగి పడుకొన్న నిందితుడికి దేహశుద్ధి చేస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. రైస్ మిల్లులో పనిచేస్తున్న 20 మంది బిహార్ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని సీఐ సత్యనారాయణ, ఎస్సై కరుణాకర్ పరిశీలించారు. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామన్నారు.