ఖైరతాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తె లంగాణ): ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తున్నారనే అక్కసు తో సీనియర్ జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్‌పై గుర్తుతెలియని దుండగులు గురువారం దాడి చేశారు. ఈ దాడి కాంగ్రెస్ మూకల పనేనని ఆరోపణలు వస్తున్నాయి. నగ రం నడిబొడ్డున, ప్రగతి భవన్‌కు కూతవేటు దూరంలో ఈ దాడి జరగడం గమనార్హం. పంజాగుట్ట మొన్నప్ప జంక్షన్ సమీపంలో సీనియర్ జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ ‘యూ’న్యూస్ పేరుతో యూ ట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం న్యూస్ చదివి స్నేహితుడు అజయ్‌తో కలిసి టిఫిన్ చేసేందు కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో 10-12 మంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ‘నీవే కదా చిలుక ప్రవీణ్’ అంటూ ప్రశ్నించారు. అవుననే సరికి అతనిపై వి రుచుకుపడ్డారు. ‘నువ్వు మారవారా?’ అంటూ పిడిగుద్దులు గుద్దారు. అడ్డు వెళ్లి న అతని స్నేహితుడు అజయ్‌ను సైతం చితకబాదారు. ఈ దాడిలో గాయపడిన ప్రవీణ్‌ను చికిత్స నిమిత్తం యశోద దవాఖానకు తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో పంజాగు ట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. దుండగులు రెండు మూడు రోజు ల నుంచి రెక్కీ నిర్వహించారు. బుధవా రం ప్రవీణ్ ఆఫీసు వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తమకు భూసమస్య ఉందని, దానిపై ఓ వార్త ప్రసారం చేయడం ద్వారా తమకు న్యాయం జరుగుతదని మాట్లాడారు. డాక్యుమెంట్లు తెచ్చారా అని ప్రశ్నించగా భిన్నమైన సమాధానాలు చెప్పి వెళ్లిపోయారని ప్రవీణ్ స్నేహితులు చెప్తున్నారు. వాళ్లే ఆఫీసును చూసి, ప్రవీణ్ ఎప్పుడు కిందకు వస్తాడు అనే వివరాలు సేకరిం చి దాడి చేశారని ఆరోపించారు. సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ప్రవీణ్‌ను ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్, గ్యాదరి కిషోర్ పరామర్శించారు.