సూర్యాపేట : ఉద్యోగాల(Jobs) పేరుతో పేరుతో మోసం చేసిన ఓ మహిళను బాధితులు చితకబాదారు. ఈ సంఘటన సూర్యాపేటలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేట(Suryapet) వైద్య కళాశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ మహిళ మోసం(woman cheated) చేసిందని ఆగ్రహించిన బాధితులు ఆమెపై దాడికి పాల్పడి స్థానిక ముత్యాల ఆలయంలో బంధించారు. సుమారు రూ.60 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మహిళను విడిపించి పోలీస్ స్టేషన్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.