మంచిర్యాల : జిల్లాలోని జన్నారం( Jannaram) మండలంలో దారుణం చోటు చేసుకుంది. రాంపూర్ గ్రామానికి చెందిన పలగాని భూమయ్య( 40 ), కుమారుడు కార్తిక్ ( 10 ) నివాసం ఉంటున్నారు. కుమారుడు పుట్టుకతోనే దివ్యాంగుడు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొడుకును పోషించేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దారుణానికి ఒడిగట్టాడు.
ముందుగా కుమారుడి గొంతుకోసి చంపి ( Murder ) అనంతరం తండ్రి కూడా గొంతు కోసుకుని ఆత్మహత్య ( Suicide ) చేసుకున్నాడు. కొడుకు కోసం చేసిన అప్పులు తీర్చలేక, పని దొరకక ఈ ఘాతుకానికి పాల్పడిన ట్లు గ్రామస్థులు వివరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.