మేడ్చల్ : మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వాతపూర్ సమీపంలోని జటాయువు ఫారెస్టు పార్కులో దారుణం చోటు చేసుకుంది. వీధికుక్కల (Dogs )దాడిలో తీవ్రంగా గాయపడ్డ జింకపిల్ల ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై అటవి శాఖ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. కాగా వీధి కుక్కలు జటాయువు(Jatayuvu park) ఫారెస్ట్ లోకి ఎలా ప్రవేశించాయన్న కోణంలో అటవి శాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పార్కుకు సమీపంలోని సాయిప్రియా కాలనీలో ప్రహరీ నిర్మాణ మరమ్మతుల చేపట్టకపోవడం వల్లనే ఘటన చోటుచేసుకుందని స్థానికులు భావిస్తున్నారు. కుందేళ్ల వేటగాళ్లు జటాయువులోకి గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశించి అందినకాడికి దోచుకుంటున్నారనే గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. వేటగాళ్లు వేసిన వలల వల్ల పార్కులోని వన్యప్రాణులు హరించుకుపోతున్నాయని వాకర్స్, స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని వార్తల కోసం : GHMC MAYOR | చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం : మేయర్ విజయలక్ష్మి
కుక్కల దాడిలో బాలుడు మరణంపై మంత్రి తలసాని విచారం .. విచారణకు మేయర్ ఆదేశం