కేంద్రంలోని మోదీ సర్కారు వైఫల్యాలను నిలదీస్తున్న భారత రాష్ట్ర సమితిపై బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నది. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. దీన్ని ఓర్వలేని బీజేపీ ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు సంబంధం లేని కేసులో ఇరికించాలని చూస్తున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. సంజయ్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నదో తెలుస్తున్నది. కేసీఆర్ నిర్వహించిన నాందేడ్ సభ విజయవంతం కావడంతో బీజేపీ జీర్ణించుకోలేక కక్షపూరిత రాజకీయాలకు తెరలేపింది.
–దీపక్ దాదా ఆత్రం, అహేరి మాజీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర