Assembly Budget Session | బడ్జెట్ సెషన్ ప్రారంభం హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్నాయి. గవర్నర్ ఆదేశం మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్ విడుదల చేశారు. తొలిరోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశ మందిరంలో శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశంతో సమావేశాలను ప్రారంభిస్తారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. నిర్దేశిత సమయానికి సభ్యులంతా హాజరుకావాలని అసెంబ్లీ కార్యదర్శి కోరారు.
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభు త్వం 2.5 శాతం డీఏను ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. డీఏ ప్రకటనతో ఆర్టీసీపై ప్రతినెలా రూ.3.6 కోట్ల అదనపు భారం పడనున్నట్టు తెలిపారు. మహిళా సమాఖ్య సంఘాల ద్వారా నేడు(శనివారం) 150 అద్దె బస్సులను ఆర్టీసీలోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నట్టు చెప్పారు. తరువాత దశలో 450 కలిపి మొత్తం 600 బస్సులను అద్దె ప్రాతిపదికన ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు.