Kova Laxmi | ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఆగస్టు 29: ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా.. ఇంటి వద్దే వైద్యం చేయించుకుంటున్నారు. గురువారం ఒకసారిగా బీపీ, షుగర్ పెరగడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అకడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరబాద్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న అభిమానులు కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు దవాఖానకు తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సకు, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మర్సుకోల సరస్వతి ఎమ్మెల్యేను పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లును అడిగి తెలుసుకున్నారు.
స్టేషన్ ఘన్పూర్/తిరుమలాయపాలెం/హసన్‌పర్తి, ఆగస్టు 29: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల విష జ్వరాలతో ముగ్గురు మృతి చెందారు. వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృత్యువాతపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మాడల్ కాలనీకి చెందిన డీసీఎం డ్రైవర్ కొరిమి ఆంజనేయులు (48), ఖమ్మం జిల్లాలో దమ్మాయిగూడేనికి చెందిన బాలిక మహన్య (6), జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లికి చెందికి అనుమాల నర్సింహారెడ్డి(13) విషజ్వరాలతో మృతిచెందారు.