కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందిన నేపథ్యంలో వాంకిడిలో ప్రజా సంఘాల వారు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఈ ఆందోళనకు మద్దతు పలికి పాల్గొనేందుకు బయలుదేరుతున్న క్రమంలో పోలీసులు ఆమె ఇంటిని చుట్టుముట్టారు. ఎమ్మెల్యే బయటికి రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. విద్యార్థిని మృతితో అప్రమత్తమైన ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు, ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం.. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు చెందిన పోలీసులను వాంకిడి, ఆసిఫాబాద్ మండల కేంద్రంలో మోహరించారు.