హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో రోజైన శనివారం 140 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ నియోజకవర్గాల నుంచి అధికార బీఆర్ఎస్ అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. వీరితోపాటు కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.
బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దేవరకొండ నుంచి రవీంద్రకుమార్, భువనగిరి నుంచి పైళ్ల శేఖర్‌రెడ్డి తమ నామినేషన్లు దాఖలు చేశారు.