రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో రోజైన శనివారం 140 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ నియోజకవర్గాల నుంచి అధికార బీఆర్ఎస్ అభ్యర్థులు పలువురు నామినేషన్లు దాఖలు చేశారు.
బాన్సువాడ నియోజకవర్గంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని బొమ్మన్దేవ్ పల్లి గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. రూ.2.88 కోట్ల�