KTR | రెండేండ్లలో ఏం చేసినవయ్యా? అంటే ‘లాగుల తొండలు విడిపిస్తా, పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లుపీకి గోటీలాడుతా నీ అమ్మ’.. గిదా నీ భాష? మాకు రాదా భాష? మేం మాట్లాడలేమా? తిట్టలేమా? ముఖ్యమంత్రి కుర్చీకి గౌరమిచ్చి ఊరుకుంటున్నం మా నాన్నను తిడితే కొడుగ్గా నాకు ఆవేశం రాదా? రేవంత్ దొరికితే ఎడమ కాలి చెప్పుతో కొట్టాలనుంది కానీ ఏం చేయాలె? ప్రజాస్వామ్యంలో ఉన్నం నేను ఆంధ్రాకు పోయి ఇంటర్ చదివితే తప్పట! కానీ ఆయన ఆంధ్రాకెళ్లి అల్లున్ని తెచ్చుకోవచ్చట! అందుకే రేవంత్‌కు భీమవరం బుల్లోడు అంటే సరి నేను నాయన పేరు చెప్పుకొని బతుకుతున్ననట.. అవును మా నాయన గొప్పోడు. తెలంగాణ తెచ్చిన మొగోడు, మొనగాడు.. బాజాప్తా చెప్త తప్పేంది? వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్‌లో గెలువకుండా చేసే బాధ్యత బీఆర్ఎస్గా మేము తీసుకుంటం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
సీఎం పదవిలో ఉన్నోడికి సంతోషం ఉండాలి. కానీ, రోజూ ఈ ఏడుపెందుకు రేవంత్‌రెడ్డీ? హామీల అమలు ఏమైందని అడిగితే గుడ్లు పీకి గోటీలాడుతా అంటడు. వీడెకడి ముఖ్యమంత్రి? రెండేండ్లలో ఏం చేశావయ్యా? అంటే ‘లాగుల తొండలు విడిపిస్తా.. పేగులు మెడలో వేసుకుంటా.. నీ అమ్మ, నీ అయ్య’.. గిదా నీ భాష? మాకు రాదా భాష? మాట్లాడుమంటవా? నేను హైదరాబాద్ గల్లీల్లో పెరిగినోడిని. మాట్లాడుమంటే ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లిష్‌లో పొల్లు పోకుండా తిట్టే తెలివి నాకున్నది. కానీ నీకు కాదు, నీ కుర్చీకి గౌరవమిచ్చి ఊరుకుంటున్నం.
-కేటీఆర్
రేవంత్‌రెడ్డీ.. తెలంగాణ తెచ్చిన నాయకుడిని, రెండు సార్లు ప్రజలు ముఖ్యమంత్రిగా గెలిపించిన వ్యక్తిని, నా తండ్రిని నువ్వు తిడుతుంటే కొడుకుగా నాకు ఆవేశం రాదా? ఓ రోజు చనిపోవాలంటవు. ఓ రోజు కాలు విరిగిందంటవు. కేసీఆర్ నా తండ్రి. ఆయనను అనరాని మాటలు అన్నందుకు రేవంత్‌రెడ్డిపై పీకలదాకా కోపం ఉన్నది. రేవంత్‌రెడ్డి కనిపిస్తే ఎడమ కాలి చెప్పుతో కొట్టాలనున్నది. కానీ ఏం చేయాలి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నం. నీకు కాదు.. నీ కుర్చీకి ఇచ్చే గౌరవంతో ఊరుకుంటున్నం.
కృష్ణా జలాల విషయంలో నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నరని కేసీఆర్ నిలదీస్తే.. ఆ భయంతోనే రేవంత్‌రెడ్డి బూతు పురాణం అందుకుంటున్నడు. ఆరు గ్యారెంటీలు ఏమైనయ్? నెలకు రూ.4,000 పెన్షన్, తులం బంగారం, ఆడపిల్లలకు రూ.2,500 వంద రోజుల్లో ఇస్తామన్న హామీలు ఏమైనయ్? రెండేండ్లు దాటినా ఎందుకిస్తలేరని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పాల్సింది పోయి బూతులు తిట్టడమేంది?
-కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ నేతలు నువ్వు బయటికి రా, బయటికి రా అని కేసీఆర్‌ను అంటున్నరు. ఆయన వచ్చి ఒక్క ప్రెస్‌మీట్ పెట్టి పోయినందుకే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినయ్. చలి జ్వరం పుట్టింది. దానికే అరుస్తున్న సీఎం.. ఇప్పుడు కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా.. అంటున్నడు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్‌రెడ్డి గుండె ఆగి చస్తడు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులుచెరిగారు. రేవంత్‌రెడ్డి వాడుతున్నది జుగుప్సాకర భాష అని మండిపడ్డారు. సత్తా ఉంటే హామీలు అమలు చేస్తానని శపథం చెయ్యాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్‌లో కూడా గెలువనీయకుండా చేసే బాధ్యత తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు శుక్రవారం బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి భాషను, వ్యక్తిత్వాన్ని, ఆయన రాజకీయ ప్రయాణాన్ని తూర్పారబట్టారు.

బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. ఓ ఫంక్షన్‌హాలు కిరాయికి ఇవ్వకుండా యజమానిని బెదించారని కేటీఆర్ ఆక్షేపించారు. ఈ చేరికల కార్యక్రమాన్ని అనిల్‌రెడ్డి ఓ ఫంక్షన్‌హాలులో ఏర్పాటుచేయాలని భావిస్తే.. కిరాయి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు. గాంధీ బెదిరింపులను లెక్కచేయకుండా వందలాది మందితో బీఆర్ఎస్లో చేరేందుకు వచ్చిన ఆల్విన్‌కాలనీ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌రెడ్డిని పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఆయనతోపాటు చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. గాంధీ 11 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టారని, శేరిలింగంపల్లిలో సమస్యలపై అసెంబ్లీలో లేవనెత్తుతామని చెప్పారు.
మార్పు అని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండేండ్లలో కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు మాత్రమే జరుగుతున్నాయని కేటీఆర్ దుయ్యబట్టారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను అడ్డగోలుగా కూలుస్తున్నారని, ఈ కాంగ్రెస్ దొంగలే కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టును పేల్చివేశారని, ఇప్పుడు రెండు, మూడు చెక్‌డ్యామ్‌లను పేల్చి ఇసుక అమ్ముకుంటున్నారని, కాంగ్రెస్ ఇసుక మాఫియా చెక్‌డ్యామ్‌లను జిలెటిక్ స్టిక్స్‌తో పేల్చివేస్తున్నదని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఎగవేతల గురించి చెప్పాల్సిన అవసరం లేదని ఎద్దేవాచేశారు. ‘అనుముల రేవంత్‌రెడ్డి కాదు.. ఆయన ఎగవేతల రేవంత్‌రెడ్డి.. రూ.4,000కు పింఛన్ పెంచనోడు, మహిళలకు రూ.2,500 ఇవ్వనోడు.. ఇప్పుడు కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తానంటే ఎవరైనా నమ్ముతరా?’ అని ఎద్దేవాచేశారు.
ఇదేందని అడిగితే పిచ్చి మొరుగుడు మొన్న కేసీఆర్ ఏమడిగిండ్రు? ఏమయ్యా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పండబెట్టినవు అని అడిగిండ్రు. ఎనిమిది నెలల క్రితమే కేంద్రం డీపీఆర్‌ను వెనకి పంపినా, దాన్ని మళ్లీ పంపి ప్రాజెక్ట్ పూర్తి చేయాలనే సోయి ఈ ప్రభుత్వానికి ఉన్నదా? 90 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టుపై ఇంకో పది పైసలు ఖర్చు పెడితే పాలమూరుకు నీళ్లు వస్తయి. ఆ పని చెయ్యిండ్రి అని అడగడం తప్పా?’ దీనికి సమాధానం చెప్పలేక రేవంత్‌రెడ్డి పిచ్చిపిచ్చిగా మొరుగుతున్నడు.
-కేటీఆర్
ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పకుండా తిట్టడం ఏమిటని కేటీఆర్ ప్రశ్నించారు. సమాధానం చెప్పే తెలివిలేకనే రేవంత్‌రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘రేవంత్‌రెడ్డికి పిచ్చి రోజురోజుకూ ముదురుతున్నది. అడ్డగోలుగా అరుస్తున్నడు. రేవంత్‌ను జల్ది కట్టేయండి.. లేకపోతే అరిచి అరిచి చివరికి ఎవరినైనా కరిచినా కరుస్తడు’ అని రేవంత్ సతీమని గీతమ్మకు విజప్తిచేశారు.
కృష్ణా జలాల విషయంలో నరేంద్ర మోదీ, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని కేసీఆర్ నిలదీస్తే.. ఆ భయంతోనే రేవంత్‌రెడ్డి బూతు పురాణం అందుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, భూముల కుంభకోణానికి, ఫ్యూచర్ సిటీ పేరుతో ఆడుతున్న డ్రామాలకు కేసీఆర్ బలమైన వాదనలతో అడ్డుపడుతుంటే, ప్రజలు ఎకడ తమపై తిరగబడతారోనన్న భయంతోనే రేవంత్‌రెడ్డి ఇష్టం వచ్చిన తిట్లు తిడుతున్నాడని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్‌రెడ్డి వాడిన భాషపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇదా ముఖ్యమంత్రి వాడే భాష? ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారికి హుందాతనం ఉండాలి. కానీ, రోజూ ఈ ఏడుపు ఎందుకు?’ అని ప్రశ్నించారు. ఎన్నికల హామీల అమలు గురించి ప్రజలు అడిగితే గుడ్లు పీకి గోటీలాడతా, పేగులు తీసి మెడలో వేసుకుంటా అని వ్యాఖ్యనించడంపై మండిపడ్డారు. ‘ముసలోళ్లు వచ్చి రూ.4,000 పెన్షన్ అడిగితే పేగులు తీస్తానని, విద్యార్థులు ఉద్యోగాల గురించి అడిగితే లాగులో తొండలు విడిపిస్తా అని బెదిరించడం ఏ రకమైన సంసారం?’ అని నిలదీశారు. ‘నీ అమ్మ, నీ అయ్య.. గిదా నీకు నేర్పిన భాష? గత రెండేండ్లలో నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. కేవలం తిట్లు తప్ప నీకేం రాదు. నేను హైదరాబాద్ గల్లీల్లో పెరిగినోడిని. తిట్టడం మొదలుపెడితే ఉర్దూ, హిందీ, తెలుగు, ఇంగ్లిష్‌లో పొల్లుపోకుండా తిట్టే తెలివి నాకున్నది. నీకు కాదు, నువ్వు కూర్చున్న కుర్చీకి గౌరవం ఇచ్చి ఊరుకుంటున్నం’ అని హెచ్చరించారు.

‘ఏమన్నా అంటే నాకు అహంకారం అంటరు.. కానీ అసలైన అహంకారం రేవంత్‌రెడ్డిదా? నాదా? ప్రజలు ఆలోచించాలి’ అని కేటీఆర్ కోరారు. తన విద్యాభ్యాసంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ‘నేను గుంటూరులో చదువుకున్నా అంటడు. నేను గుంటూరులో చదువుకుంటే రేవంత్కేంది నొప్పి? నేను ప్రపంచమంతా చదువుకున్న. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నది. ఆ సమయంలో నేను గుంటూరులోనే కాదు.. హైదరాబాద్, పుణె, అమెరికా ఇట్ల ప్రపంచమంతా చదివిన’ అని స్పష్టంచేశారు. రేవంత్ మాదిరిగా తాను చదువు సంధ్య లేకుండా తిరగలేదని, రేవంత్‌కు వారి అమ్మయ్య చకటి తోవ చూపించకపోతే తానేం చేయాలని ఎద్దేవా చేశారు. తనకు ఇంగ్లిష్, హిందీ రావడం చూసి రేవంత్‌రెడ్డి ఎందుకు ఏడుస్తున్నారని, సత్తా ఉంటే ఆయన కూడా నేర్చుకోవాలని, ఆయనను ఎవరూ ఆపలేదని చురకలంటించారు. ‘నేను ఆంధ్రాలో చదువుకుంటే తప్పంటున్న రేవంత్‌రెడ్డి.. ఆంధ్రా నుంచి అల్లున్ని తెచ్చుకోవడం తప్పు కాదా? అందుకే ఇంకా రేవంత్‌కు చిట్టి నాయుడని కాకుండా భీమవరం బుల్లోడు అని పేరు పెడితే సరిపోతుంది’ అని ఎద్దేవా చేశారు.
మా నాయన తెలంగాణ తెచ్చిన మొనగాడు నేను మా నాయన కేసీఆర్ పేరు చెప్పుకొని బతుకుతున్న అంటున్నవు. అవును మా నాయన గొప్పోడు. మా నాయన తెలంగాణ తెచ్చిన మొగోడు, మొనగాడు. బరాబర్ చెప్పుకొంటా! గర్వంగా చెప్పుకుంటా. తప్పేమున్నది? మా నాయన పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకొంటడు? నీకు సత్తా ఉంటే హామీలు అమలు చేస్తానని శపథం చెయ్. వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్‌లో కూడా గెలువనీయకుండా చేసే బాధ్యత మేం తీసుకుంటం.
-కేటీఆర్
‘ఆమెరికాలో నా పని నేను చేసుకుంటే రేవంత్‌రెడ్డికి వచ్చిన నొప్పేంది’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘అమెరికాలో కేటీఆర్ బాత్రుమ్‌లు కడుగుతడు అని రేవంత్ అంటారు.. నా బాత్రూమ్ నేను కడుక్కుంటే నీకేం నొప్పి బై. అమెరికాలో ఎవరి పని వారే చేసుకుంటరు. ఎవరి ఇండ్లళ్ల వాళ్లు తోముకుంటే తప్పా? బట్టలు ఉతుక్కుంటే తప్పా? మహిళలు ఇంటి పని అంతా వాళ్లే చేస్తరు. అమెరికాలో చదువుకోవడానికి వెళ్లినప్పుడు రూమ్‌లో మన పని మనమే చేసుకుంటం. ఎవరి గిన్నెలు వాళ్లే తోముకోవాలి. ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి. ఎవరి టాయిలెట్ వారే క్లీన్ చేసుకోవాలి. ఇందులో తప్పేమున్నది? నీ లెక్క నేనైతే సంచులు మోయలేదు. దొంగ పనులు చేయలేదు. ఢిల్లీకి మూటలు మోయలేదు. నన్ను జైల్లో వేయకండి అని జడ్జిల కాళ్లు పట్టుకోలేదు’ అని చురకలంటించారు.
తన తండ్రి పేరు చెప్పుకోవడం తనకెంతో గర్వకారణమని కేటీఆర్ తెలిపారు. ‘నేను మా నాయన కేసీఆర్ పేరు చెప్పుకుని బతుకుతున్నా అంటావు. అవును మా నాయన గొప్పోడు. మా నాయన తెలంగాణ తెచ్చిన మొగోడు, మొనగాడు. బరాబర్ చెప్పుకొంటా! గర్వంగా చెప్పుకొంటా. తప్పేమున్నది? మా నాయన పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకొంటాడు? నువ్వు సకటి పనులు చేస్తే నీ పిల్లలు నీ పేరు చెప్పుకొంటరు. కానీ ఇలాంటి లుచ్చా పనులు చేస్తే నీ మనవడు కూడా నీ పేరు చెప్పుకోడానికి సిగ్గుపడుతడు’ అని దుయ్యబట్టారు. ‘కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని కానీయనని శపథాలు చేస్తున్న రేవంత్‌రెడ్డికి ఒకటే చెప్తున్న.. నీకు సత్తా ఉంటే హామీలు అమలు చేస్తానని శపథం చెయ్. రూ.2,500 ఇస్తా, తులం బంగారం ఇస్తా అని శపథం చెయ్. అది చేతగాదు. వచ్చే ఎన్నికల్లో నిన్ను కొడంగల్‌లో కూడా గెలువనీయకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటం. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ కొడంగల్‌లో నిన్ను గెలువనియ్యం. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నయి’ అని స్పష్టంచేశారు. ‘వచ్చే ఎన్నికలు ఏవైనా కారు గుర్తుపై ఓటేయాలి. కేసీఆర్‌ను గెలిపించాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సామా వెంకటరెడ్డి, నాయకులు బొబ్బా నవతారెడ్డి, శ్రీనివాస్, సాయిబాబా, సంగారెడ్డి, హరీశ్, రవీందర్‌యాదవ్ పాల్గొన్నారు.
‘రోడ్ల మీద పెయింటింగ్స్ వేసేటోడు.. దొంగ పనులు చేసి సీఎం అయ్యాడు’ అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డీ.. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవ్? నీ ప్రయాణం ఎకడ మొదలైంది? రోడ్ల మీద పెయింటింగ్స్ వేసుకునేటోనివి. జీవితంలో ఎవరైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి రావాలి. తప్పు లేదు. కానీ మంచి పనులు చేసి రావాలి. లంగ పనులు, దొంగ పనులు చేసి, బ్యాగులు, సంచులు మోసి, దొరికిపోయి, జైలుకు వెళ్లి రావడం, మళ్లీ అదేదో పెద్ద గొప్ప విషయమన్నట్టు పోజులు కొట్టడం రేవంత్‌రెడ్డికే చెల్లింది. రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పైసలిచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నడు. ఇప్పుడు కూడా నెలనెలా ఢిల్లీకి పైసలు పంపుతూ పదవి కాపాడుకుంటున్నడు’ అని దెప్పిపొడిచారు.