పాల్వంచ/లక్ష్మీదేవిపల్లి/హనుమకొండ, ఏప్రిల్ 11 : విద్యుత్తు ఆర్టిజన్లు చేపట్టిన నా లుగోరోజు సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ వద్ద ఉద్రిక్తంగా మారిం ది. ఆర్టిజన్ జాక్ పిలుపు మేరకు చేపట్టిన ‘చలో కేటీపీఎస్’ శనివారం నిర్బంధాల మధ్య కొనసాగింది. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు. అయినా కార్మికులు తప్పించుకుని సమ్మె శిబిరం వద్దకు చేరుకున్నారు.
ఉద్రిక్తతలు తలెత్తుతాయనే ఉద్దేశంతో డీఎస్పీ సతీశ్‌కుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పలుకార్మిక సంఘాల నేతలు సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్, పీస్‌రేట్ కార్మికులు విధులు బహిష్కరించి శనివారం కూడా స మ్మె కొనసాగించారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేదాకా సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పారు. భూపాలపల్లి జిల్లా చెల్పూరులోని కేటీపీపీ ప్రధాన ద్వారం వద్ద సమ్మె శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు.