ఐదో రోజుకు ఆర్టిజన్ల సమ్మె
విద్యుత్తు రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మె కొనసాగుతున్నది. ఖమ్మం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణం, మధిర డివిజన్ కార్యాలయంలో ఆర్టిజన్లు కొనసాగిస్తున్న సమ్మె ఆదివారం ఐదోరోజుకు చేరింది.
పాల్వంచ/మధిర/తొర్రూరు, ఏప్రిల్ 12 : విద్యుత్తు రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మె కొనసాగుతున్నది. ఖమ్మం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణం, మధిర డివిజన్ కార్యాలయంలో ఆర్టిజన్లు కొనసాగిస్తున్న సమ్మె ఆదివారం ఐదోరోజుకు చేరింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదుట ఉన్న విద్యుత్తు కార్యాలయ ప్రాంగణంలో ఆర్టిజన్లు చేపట్టిన సమ్మెకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం జీవో నంబర్ 11ను అమలు చేసి విద్యుత్తు కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించి వేతనాలు పెంచిందని అన్నారు. తకువ వేతనాలతో కుటుంబాలను పోషించలేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటివరకు 200 మంది కార్మికులు మరణించినట్టు తెలిపారు.
తహసీల్దార్‌పై బదిలీవేటు
- ‘రామాలయం రాసిచ్చిండ్రు’కథనానికి స్పందన
రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లిలోని శ్రీ సీతారామాంజనేయస్వామి ఆలయ ఆస్తిని కాంగ్రెస్నేతకు అధికారులు రాసిచ్చిన ఘటనలో బోయినపల్లి తహసీల్దార్‌పై బదిలీవేటు పడింది. ‘రామాలయం రాసిచ్చిండ్రు’ అనే శీర్షికన ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం జిల్లాలో సంచలనం రేపగా, ఆ మరుసటి రోజే సర్పంచ్ అనుముల భాస్కర్, గ్రామస్తులు కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో సర్టిఫికెట్ జారీ వ్యవహారంపై విచారణ చేయాలని వేములవాడ ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు. రిపోర్ట్ ఆధారంగా తహసీల్దార్ నారాయణరెడ్డిని బోయినపల్లి నుంచి వీర్నపల్లికి డిప్యుటేషన్‌పై బదిలీచేస్తూ, ఈనెల 10న ఉత్తర్వులు జారీచేశారు. సదరు సర్టిఫికెట్ రద్దు చేశారా..? రామాలయాన్ని గ్రామ పంచాయతీ ఆస్తిగా గుర్తించారా లేదా..? అనేది తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

