Arun Pillai | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన వద్ద బలవంతంగా వాంగ్మూలం తీసుకొన్నదని, అదంతా తప్పని ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై కోర్టును ఆశ్రయించారు. ఆ వాంగ్మూలాలను ఉపసంహరించుకోవాలనుకొంటున్నట్టు పిటిషన్ దాఖలు చేశారు.
ఈడీ తన వద్ద రెండు పత్రాలపై బలవంతంగా సంతకం చేయించుకొన్నదని, ఆ పత్రాల్లో తన వాంగ్మూలాలను సమర్పించిందని వివరించారు. ఆ వాంగ్మూలాన్ని ముందు పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి తాను సన్నిహితుడినంటూ ఒక కట్టుకథ అల్లుతున్నారని పేర్కొన్నారు. దీంతో ఈ నెల 13న ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.