షాద్నగర్, అక్టోబర్ 11: సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రానికి చెందిన పలువురు రైతులను శుక్రవారం ఉదయం పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి చౌదరిగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు. కొం దుర్గు మండల కేంద్రంలో ప్రభుత్వం కొత్త గా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి కేటాయించిన స్థలాన్ని.. గతంలో కొం దుర్గు గ్రామానికి చెందిన రైతులు సున్నాల నర్సింహులు, సున్నాల చిన్న రాములు, సున్నాల రాంచంద్రయ్య, సున్నాల వెంకట్రాములుకు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ప్రభుత్వం తమకు కేటాయించిన భూమిని చదును చేశారని బాధిత రైతులు వాపోయారు. ఈ విషయమై అధికారులను అడిగితే తమను అక్రమంగా అరెస్ట్ చేసి చౌదరిగూడ పోలీస్ స్టేషన్కు తరలించినట్టు చె ప్పారు. రైతుల అక్రమ అరెస్టును స్థానికులు, బీఆర్ఎస్ నేతలు ఖండించారు. బాధిత రైతులకు సరైన న్యాయం చేయాల ని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.