హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నవీన్ మిట్టల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయెల్, కార్యదర్శి రఘునందన్‌రావు, డీజీపీ (లాఅండ్ఆర్డర్) మహేశ్ భగవత్, అధికారులు పాల్గొన్నారు.