పూడూరు, ఆగస్టు 31: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంతంలో నేవీ సిగ్నల్ రాడర్ స్టేషన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసేందుకు ఉన్నతాధికారులు పనులను ముమ్మరం చేశారు. దామగుండం దేవాలయ ప్రాంతంలో 12 ఏండ్ల క్రితం 2,900 ఎకరాల అటవీ భూమిని నేవీ సిగ్నల్ రాడర్ స్టేషన్ కోసం ఎంపిక చేశారు.
స్థానికుల కోరిక మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూములను నేవీకి అప్పగించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూమిని నేవీ అధికారులకు అప్పగించింది. ఈ నెలలో సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రులతో పనులు ప్రారంభించేందుకు శిలాఫలకం ఏర్పాటు, భూమి పూజ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫారెస్ట్ భూమి నేవీ ఆధీనంలోకి వెళ్తే దేవాలయానికి వెళ్లలేమని, పశువుల మేతకు ఇబ్బందవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు.