వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంతంలో నేవీ సిగ్నల్ రాడర్ స్టేషన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసేందుకు ఉన్నతాధికారులు పనులను ముమ్మరం చేశారు.
వికారాబాద్ అడవుల్లో ఐదు దాకా నదులు ఊపిరిపోసుకుంటాయి. ఇక్కడి గాలి విశిష్టమైంది. ఆరోగ్యదాయకమైంది. అందుకే అనంతగిరిలో టీబీ శానిటోరియం నెలకొన్నది. విశిష్టమైన జీవవైవిధ్యం ఈ అడవుల చల్లని నీడలో వర్ధిల్లుతున్