Vikarabad Forest | నౌకాదళానికి వికారాబాద్ అడవి.. వీఎల్ఎఫ్ స్టేషన్ పనులు ప్రారంభం
వికారాబాద్ అడవిలో భారత నౌకాదళం దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నది.
- వీఎల్ఎఫ్ స్టేషన్ కోసం ఏర్పాటు
- ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సరిహద్దుల పనులు ప్రారంభం
Vikarabad Forest | హైదరాబాద్, జూన్ 9 (నమస్తేతెలంగాణ): వికారాబాద్ అడవిలో భారత నౌకాదళం దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్మిషన్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నది. పూడూరు మండలంలో ఏర్పాటు చేయనున్న ఈ స్టేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లా దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో 2,901 ఎకరాల అటవీభూమిని నేవీకి కేటాయించింది. తాజాగా ఆ భూమిని నౌకాదళం తమ అధీనంలోకి తీసుకున్నది. ఈ ప్రాంతం చుట్టూ సరిహద్దులు ఏర్పాటుచేసే ప్రక్రియను ప్రారంభించింది. 2027 చివరి నాటికి వీఎల్ఎఫ్ నిర్మించాలన్నది లక్ష్యం. వీఎల్ఎఫ్ స్టేషన్ కోసం తీసుకున్న అటవీభూముల చుట్టూ 27 కిలోమీటర్ల మేర నౌకాదళం నూతన రహదారిని నిర్మించనున్నట్టు సమాచారం.
దామగుండం రిజర్వ్ ఫారెస్టు మధ్యలోంచి ప్రస్తుతం రోడ్డు సౌకర్యం ఉన్నది. వీఎల్ఎఫ్ స్టేషన్ నిర్మాణం నేపథ్యంలో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా రాకపోకల విషయంలో మార్పులు చేయనున్నట్టు తెలిసింది. దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో వన్యప్రాణులు ఉన్నాయి. ఈ అడవిలో 700 వరకు జింకలు ఉన్నట్టు అటవీశాఖ అంచనా వేస్తున్నది. వీటితోపాటు అడవి పందులు, కుందేళ్లు వంటివి కూడా ఉన్నాయి. ఇన్నాళ్లు అటవీశాఖ సంరక్షణలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు నౌకాదళం ఆధీనంలోకి వెళ్లింది. దీంతో వన్యప్రాణుల సంరక్షణ అనేది కీలకంగా మారింది. వికారాబాద్ అడవిలో వీఎల్ఎఫ్ సెంటర్ ఏర్పాటుకు భూమిని కేటాయించడాన్ని నిరసిస్తూ పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళలు చేసినప్పటికీ, ఈ ప్రక్రియ ముందుకే సాగుతుండటం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

