హైదరాబాద్ : రాష్ట్రంలో ఈనెల 13న నిర్వహించనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ( Polytechnic Entrance Exam ) ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ,ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ ( Engineering ) , నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ( Agricultural ) , ఉద్యానవన , వెటర్నరీ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి ఉదయం 11 గంటల నుంఇ మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 56,494 మంది విద్యార్థులు, 49,945 మంది విద్యార్థినులు పరీక్షలకు దరఖాస్తులు చేసుకున్నారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 293 పరీక్ష కేంద్రాను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు పరీక్ష సమయానికి గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్ కానీ, ఏ ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువులను అనుమతించబోమని వివరించారు.