కంఠేశ్వర్, ఏప్రిల్ 25: పదేండ్ల కేసీఆర్ పాలన సంక్షేమమైతే.. 17 నెలల రేవంత్‌రెడ్డి పాలన విధ్వంసమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి వేముల మాట్లాడారు. టీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ ప్రజల కోసమని చెప్పారు.
15 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించి ప్రజలకు విముక్తి కలిగించిందని తెలిపారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలబెట్టారని గుర్తుచేశారు. రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి 2,400 వాహనాల్లో 40 వేల మంది తరలివెళ్లనున్నట్టు చెప్పారు.
మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 25 : గులాబీ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు దండులా కదలాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా శ్రీనివాస్‌గౌడ్ పాల్గొనగా.. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు పాలమూరు జిల్లా నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.
హసన్‌పర్తి, ఏప్రిల్ 25 : ఎల్కతుర్తిలో 27న నిర్వహించే రజతోత్సవ సభలో వర్ధన్నపేట నియోజకవర్గ పౌరుషాన్ని మరోసారి నిలబెట్టుకోవాలని వర్ధన్నపేట ఇన్చార్జి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో శుక్రవారం ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించగా.. ఎర్రబెల్లి ఎడ్లబండి నడుపుతూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు ఉదయమే పార్టీ జెండా ఎగరవేసి సభాస్థలికి చేరుకోవాలని సూచించారు. సభలో ఎడ్లబండ్లు హైలెట్ కావాలని తెలిపారు.
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 25: దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నామని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. చలో వరంగల్ ఏర్పాట్లపై ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్ నియోజకవర్గాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ రాక్షస పాలనపై వరంగల్ సభ యుద్ధభేరి మోగిస్తుందని చెప్పారు. అనంతరం ఆర్మూర్‌లో రేవంత్ గోబ్యాక్ – కేసీఆర్ కమ్ బ్యాక్ అని వాల్ పెయింటింగ్ రాశారు.
మహబూబాబాద్ రూరల్, ఏప్రిల్ 25 : ఎల్కతుర్తి సభకు రావాలని మహబూబాబాద్‌లోని 35వ వార్డ్డులో మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ శుక్రవారం మహిళలకు బొట్టుపెట్టి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి క్యాంప్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కేసీఆర్ సందేశం వినాలని ప్రజలు సభకు స్వచ్ఛందంగా వస్తున్నట్టు తెలిపారు.