యథావిధిగా భక్తుల దర్శనాలు
యాదాద్రి, మార్చి 16 : యాదాద్రి లక్ష్శీనరసింహస్వామి ప్రధానాలయం పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో గురువారం నుంచి బాలాలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. భక్తులతో నిర్వహించే సుదర్శన నారసింహ హోమం, కల్యాణోత్సవం, స్వామివారి జోడు సేవలు రద్దు చేసినట్టు చెప్పారు. పంచకుండాత్మక మహాయాగం బాలాలయంలోనే చేపట్టాల్సి ఉన్నదని, ఈ క్రమంలో యాగానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. స్వామివారి కల్యాణోత్సవం, సుదర్శన నారసింహ హోమం జోడు సేవలను పాతగుట్టలో నిర్వహిస్తామని అన్నారు. స్వామివారి దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.