హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై బుధవారం హైకోర్టులో జ రగనున్న విచారణలో ప్రభుత్వ ప రంగా సమర్థంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ సూచించారు. హైకోర్టు విచారణ నేపథ్యంలో సీఎం మంగళవారం తన నివాసంలో మం త్రులు, పార్టీ నేతలతో కీలక సమావే శం నిర్వహించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రు లు పొన్నం, ఉత్తమ్, పొంగులేటి, వాకిటి శ్రీహరి సమావేశంలో పాల్గొన్నారు. హైకోర్టులో కేసు విచారణ ప ర్యవేక్షణ బాధ్యతను మంత్రి పొన్నం కు అప్పగించారు. తీర్పు ప్రతికూలంగా వస్తే అనుసరించాల్సిన వ్యూ హాంతోపాటు వానకాలం సీజన్ ధాన్యం కొనుగోలు అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం.