జగిత్యాల : మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఎత్తిపోతల (Kaleshwaram project )పథకాల ద్వారా రాష్ట్రంలోని చెరువులు జలకళను సంతరించుకున్నాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండల కండ్ల పల్లి గ్రామ, పట్టణ శివారులోని చెరువు కట్ట మరమ్మతు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ నిండు వేసవిలోనూ చెరువులు మత్తడి పారుతున్నాయని అన్నారు.
గత ప్రభుత్వాలు చెరువుల్లో తట్టెడు మట్టికూడా తీయకుండా చెరువుల ఆక్రమణకు కారణమయ్యారని ఆరోపించారు.చెరువులో ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా గంగపుత్రులు జీవనోపాధి పెరిగిందని అన్నారు.భూములకు డిమాండ్ పెరగడం వల్ల కొంతమంది ఆక్రమణదారులు ఎఫ్టీఎల్ భూముల్లో నిర్మాణాలు చేపట్టడం వల్ల చెరువులు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.
ఎఫ్టీఎల్ భూములు ఖబ్జా కాకుండా సీఎం కేసీఆర్(cm kcr) చర్యలు తీసుకున్నారని వెల్లడించారు. చెరువులు, కట్టలు ఆక్రమణ కు గురి కాకుండా ప్రజలు,రైతుల భాగస్వామ్యం తప్పనిసరి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, సర్పంచ్ లు రజిత శేఖర్,తిరుపతి,ఎంపీటీసీ సౌజన్య తిరుపతి, కౌన్సిలర్ ,ఆసియా సుల్తానా, జిల్లా రైతు బంధుసమితి సభ్యులు దామోదర్ రావు, కౌన్సిలర్ మల్లిఖార్జున్ , పంబాల్ రామ్ కుమార్,కూతురు రాజేశ్,ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు పాల్గొన్నారు.