500 అదనపు పాస్‌పోర్టు అపాయింట్మెంట్లు
పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో సుదీర్ఘ నిరీక్షణను తగ్గించేందుకు ఈ నెల 27 నుంచి 2 వారాలపాటు రోజుకు 500 చొప్పున అదనంగా అపాయింట్మెంట్లను పెంచుతున్నట్టు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు.
- ఈ నెల 27 నుంచి రెండు వారాల పాటు కొనసాగనున్న ప్రక్రియ
- ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతుండటంతో సుదీర్ఘ నిరీక్షణను తగ్గించేందుకు ఈ నెల 27 నుంచి 2 వారాలపాటు రోజుకు 500 చొప్పున అదనంగా అపాయింట్మెంట్లను పెంచుతున్నట్టు ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు. 27 తేదీ అపాయింట్మెంట్లు 25వ తేదీ సాయంత్రం నుంచే పాస్‌పోర్టు సేవా వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.
అంబేదర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్కే), 14 పాస్‌పోర్ట్ ఆఫీస్ సేవా కేంద్రాల్లో (పీవోఎస్కే) తాతాలికంగా కార్యకలాపాలను నిలిపివేసినందున రెండు వారాలపాటు అదనపు అపాయింట్మెంట్లను విడుదల చేయాలని నిర్ణయించినట్టు వివరించారు.
దరఖాస్తుదారులు www.passportindia.gov.in వెబ్సైట్ ద్వారా లేదా mPassportseva మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని, స్లాట్లు బుక్‌చేసిన పీఎస్‌కేలకు హాజరుకావాలని సూచించారు. దరఖాస్తుదారులందరికీ ముందస్తు అపాయింట్మెంట్ తప్పనిసరని, నేరుగా పీఎస్కే, పీవోపీఎస్కేలకు వచ్చేందుకు అవకాశం లేదని స్పష్టం చేశారు. పాస్‌పోర్టుల కోసం మధ్యవర్తులను, బ్రోకర్లను సంప్రదించవద్దని, ఆన్లైన్ ద్వారా ముందే అపాయింట్మెంట్ పొంది వస్తే సరిపోతుందని
పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

