హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శాసనసభ, శాసనమండలిలో బీఆర్ఎస్పక్ష ఉపనేతలను నియమించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
శాసనసభలో డిప్యుటీ ఫ్లోర్‌లీడర్లుగా తన్నీరు హరీశ్‌రావు, పటోళ్ల సబితాఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శాసనమండలిలో ఉపనేతలుగా ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని ప్రకటించారు. శాసనమండలిలో పార్టీ విప్‌గా దేశపతి శ్రీనివాస్‌ను నియమించారు.