హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్‌తో కలిసి నియామక పత్రాలు అందజేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్లో కార్యక్రమాన్ని నిర్వహించారు.
డీఏ విడుదలపై టీఎన్జీవోల హర్షం
హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : పెండింగ్ డీఏల్లో ఒక డీఏను విడుదల చేయడంపై టీఎన్జీవో కేంద్ర సంఘం హర్షం వ్యక్తంచేసింది. 3.64% డీఏను విడుదల చేయడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.