హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగ ప్రకటనలు 2004కు ముందే వెలువడి, 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ స్థానంలో పాత పింఛన్‌ను అమలుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రభుత్వాన్ని కోరింది.
ఏపీలో ఇలాంటికి వారికి పాత పింఛన్ అమలుచేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించిందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముల కమలాకర్, ప్రధాన కార్యదర్శి చీటి భూపతిరావులు తెలిపారు. ఇదే తరహాలో తెలంగాణలోను అమలుచేయాలని కోరారు.