హైదరాబాద్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని ప్రతిభా కేంద్రాలు (సీవోఈ), జూనియర్ కాలేజీలు, సైనిక్, ఒకేషనల్, ఫైన్ ఆర్ట్స్ కాలేజీల్లో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. సొసైటీ కార్యదర్శి సోమవారం పకటన విడుదల చేశారు.
ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు 25లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 15న రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష ఉంటుందని వెల్లడించారు. వివరాలకు వెబ్సైట్ను http://rjcet.telangana.gov.in , http://TGSWREI S.telangana.gov.in సందర్శించాలని సూచించారు.