Guest Faculty | చేవెళ్ల టౌన్, జూలై 19 : చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. కాంచనలత ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలేజ్ విద్యాశాఖ కమిషనర్ సూచనల ప్రకారం, హిస్టరీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో బోధన కోసం ఈ నియామకాలను చేపడుతున్నట్టు చెప్పారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ, డిగ్రీ పొందినవారై ఉండాలని, ఓసీ అభ్యర్థులకు కనీసం 55 శాతం, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలని పేర్కొన్నారు. నెట్, సెట్, పీహెచ్డీ వంటి అదనపు అర్హతలు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది పేర్కొన్నారు. బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత ధృవపత్రాల జిరాక్స్ ప్రతులతో కలిపి చేవెళ్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇవ్వాలని సూచించారు.