హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్-2025 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రాజ్‌భవన్ అధికారులు తెలిపారు. మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ అండ్ మెడికల్, కార్పొరేట్ వలంటరీ రంగాల్లో ఐదేండ్లకు తక్కువకాకుండా(2020 నుంచి) విశేష సేవలందించిన వ్యక్తులు నేటి ఆదివారం నుంచి డిసెంబర్ 12లోగా దరఖాస్తు చేసుకోవాలని శనివారం ప్రకటనలో సూచించారు.
అవార్డులను వ్యక్తిగత, సంఘాలు లేదా సంస్థలు లేదా ట్రస్టులకు ప్రదానం చేయనున్నామని వెల్లడించారు. పూర్తి వివరాలతో కూడిన అప్లికేషన్లను ప్రిన్సిపల్ సెక్రటరీ టూ గవర్నర్, గవర్నర్ సెక్రటేరియట్, రాజ్‌భవన్, సోమాజిగూడ, హైదరాబాద్- 5000041 చిరునామాకు పంపించాలని కోరారు. వివరాలకు governer. telangana. gov.inలోగాని, 9100866066 ఫోన్ నంబర్లో సంప్రదించాలని విజ్ఞప్తిచేశారు. ఎంపికైన వ్యక్తులు, సంస్థలకు రానున్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ అవార్డులు ప్రదానం చేస్తారని వెల్లడించారు.