హైదరాబాద్, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ) ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) తమ వార్షిక ఎక్సలెన్స్ అవార్డులు-2025 కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ఫెడరేషన్ అధ్యక్షులు సురేశ్ కుమార్ సింఘాల్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ… వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఎగుమతులు, ఏరోస్పేస్-డిఫెన్స్, టూరిజం తదితర మొత్తం 21 విభాగాల్లో నామినేషన్లు ఆహ్వానించినట్టు, వీటిలో అత్యుత్తమ ప్రతిభగల కంపెనీలు, వ్యక్తులను అవార్డుల కోసం ఎంపికచేస్తామని తెలిపారు. ఇందుకోసం ఆరుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించినట్టు చెప్పారు. గడిచిన 50 ఏండ్లుగా ఈ అవార్డులు ఇస్తున్నట్లు, ఈసారి మాత్రం పూర్తిగా డిజిటలైజేషన్ పద్ధతిన స్వీకరిస్తున్నట్టు చెప్పారు. వీటికి మే 10వ తేదీ చివరి గడువని, ఎంపికైన సంస్థ లు, పారిశ్రామికవేత్తలకు జూన్ నెలలో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు సింఘాల్ వివరించారు. గడిచిన సంవత్సరంలో 200కి పైగా దరఖాస్తులు రాగా, ఈసారి మరింత పెరి ౩00 దాటే అవకాశం ఉన్నదన్నారు.