హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ నియామక మండలి (టీజీపీఆర్బీ) ఆధ్వర్యంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాతపరీక్షను ఈనెల 14న నిర్వహించనున్నట్టు బోర్డు డైరెక్టర్ వీవీ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
దరఖాస్తుదారులు ఈనెల 6నుంచి హాట్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.