హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): కర్నూలు జిల్లాలోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్టుకు హైదరాబాద్‌లో ఉన్న భూములపై తెలంగాణ ప్రభుత్వానికి అధికారం లేదంటూ ఏపీ ప్రభుత్వం ఒక కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. కొండాపూర్‌లోని రూ.4 వేల కోట్లకుపైగా విలువైన 42.03 ఎకరాల భూ ములపై తెలంగాణాకు ఎలాంటి అధికారం లేదని హైకోర్టుకు నివేదించింది. దేవాదాయ చట్టం ప్రకారం కర్నూలులో రిజిస్టర్ అయిన ట్రస్టు భూముల నిర్వహణ బాధ్య త పూర్తిగా ఏపీ ప్రభుత్వానికే ఉంటుందని తెలిపింది. భూ గరిష్ఠ నియంత్రణ చట్టం కింద 2005లో ఇచ్చిన జీవోను పునఃసమీక్షించి ఆ భూమిని ప్రైవేటు సంస్థ, వ్యక్తులైన భూపతి ఎస్టేట్స్‌కు కట్టబెట్టే అధికారం తె లంగాణకు లేదని పేర్కొంది.
ట్రస్టుకు చెంది న భూములను భూపతి ఎస్టేట్స్‌కు తెలంగాణ ప్రభుత్వం కేటాయించడాన్ని సవాల్ చేస్తూ టీ సంతోష్‌కుమార్ సహా ఐదుగురు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో ఏపీ ప్రభుత్వం వాదనతో ఆ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ కౌంటర్ దాఖలుచేశారు. ఈ పిల్లో హైకోర్టు ఆదేశించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తమ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఇటీవల రూ.5000 జరిమానా విధించింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో.. 2005లో వెలువడిన జీవో ప్రకారం బాలసాయిబాబా ట్రస్ట్‌కు చెందిన 42 ఎకరాల భూములు దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చాయని తెలిపింది. దేవాదాయశాఖకు చెందిన భూములను హైకోర్టు అనుమతి లేకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించరాదనే మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఉన్నాయి..’అని పేరొంది.