హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): మార్గదర్శి చిట్ఫండ్ చైర్మన్ రామోజీరావుపై ఏపీ సీఐడీకి మరో ఫిర్యాదు అందింది. సంస్థలో తమకు రావాల్సిన వాటా కోసం వెళ్తే రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా ఆయన పేరిటే రాయించుకున్నారని మార్గదర్శి వ్యవస్థాపకుడు గాదిరెడ్డి జగన్నాథరెడ్డిరెడ్డి(జీజే రెడ్డి) కుమారుడు యూరిరెడ్డి ఫిర్యాదుచేశారు.
కృష్ణా జిల్లాకు చెందిన తన తండ్రి జీజేరెడ్డి ఢిల్లీ కేంద్రంగా నవభారత్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలను స్థాపించారని, అందులో రామోజీరావు ఉద్యోగం చేశారని యూరిరెడ్డి తెలిపారు. రామోజీరావు చిట్ఫండ్ కంపెనీ ఏర్పాటుసమయంలో పెట్టుబడి పెట్టినందుకు షేర్లు కేటాయించారని, ఈ వాటాలు అడగడానికి వెళ్తే తుపాకీతో బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.