హైదరాబాద్, మే20 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించలేదని ఏపీ తొండివాదనలకు దిగింది. ఈ మేరకు కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట తన వాదనలు వినిపించింది. సెక్షన్-3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల మేరకు ఏపీ, తెలంగాణ రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పంపిణీపై బుధవారం ఢిల్లీలో ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేశ్‌కుమార్ ఎదుట వాదనలు కొనసాగాయి. ఈ సందర్భంగా ఏపీ మరోసారి తొండివాదనలకు దిగింది.
షెడ్యూల్ 11లోని కల్వకుర్తి, నెట్టెంపాడు తప్ప తెలంగాణ చేపట్టిన అన్ని ప్రాజెక్టులూ కొత్తవేనని, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూడా కొత్తదేనని నివేదించింది. పాలమూరు-రంగారెడ్డి సహా తెలంగాణ చేపట్టిన ఇతర ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని తేల్చిచెప్పింది. కల్వకుర్తి, నెట్టెంపాడు లిఫ్ట్ సీమ్‌లను సైతం 65శాతం డిపెండబిలిటీతో కట్టినవేనని, ఆయా ప్రాజెక్టులను 25 టీఎంసీలు, 22 టీఎంసీల నీటివాటాలకే ఒప్పుకుంటామని తేల్చిచెప్పింది.