హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : అమెరికాకు చెందిన అరిజోనా స్టేట్ వర్సిటీతో రాష్ట్రంలోని అనురాగ్ వర్సిటీ ఎంవోయూ కుదుర్చుకున్నది. సోమవారం హైదరాబాద్లో అనురాగ్ వర్సిటీ చైర్మన్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, అరిజోనా వర్సిటీ సీనియర్ డైరెక్టర్ క్రిస్ జాన్సన్ పాల్గొన్నారు. విద్యార్థులు తొలుత అనురాగ్ వర్సిటీలోని ఇంటర్నేషనల్ కాలేజీలో చదువును ప్రారంభిస్తారు. ఆ తర్వాత అమెరికాకు వెళ్లి డిగ్రీ కోర్సు పూర్తిచేస్తారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఈ ఒప్పందం తక్కువ ఖర్చుతో, అంతర్జాతీయ విద్యను అందించాలన్న తమ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు.