Minister Gangula | తెలంగాణ వ్యతిరేక శక్తులకు అవకాశమిస్తే మరోసారి దగా పడ్తాం : మంత్రి గంగుల
Minister Gangula | రాబోయే ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేక శక్తులకు అవకాశమిస్తే మరోసారి దగా పడతామని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు.
కరీంనగర్ : రాబోయే ఎన్నికల్లో తెలంగాణ వ్యతిరేక శక్తులకు అవకాశమిస్తే మరోసారి దగా పడతామని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు. ఇక్కడి సంపదను దోచుకుని తెలంగాణ ఆంధ్రాలో కలుపుతారని పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్ పట్టణంలోని 30వ డివిజన్ మారుతీ నగర్లో కోటి 28లక్షలతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు(Development Works) నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తో కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యతిరేక శక్తులు(Anti-Telangana forces) ఏకమై పోటీ చేసేందుకు వస్తున్నారని వారంతా ఎన్నికల్లో ఓట్ల కోసమే వచ్చి మాయమవుతారని పేర్కొన్నారు. ఢిల్లీ పార్టీల మాటలు విని మోసపోతే మళ్లీ గోసపడుతామని, ఇక్కడి నీరు, బొగ్గు, నిధులు, కరెంట్‌ను ఆంధ్రకు మళ్లీస్తారని అన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నాటి నుంచి నేటి వరకు కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్(Cheif Minister KCR) అని అన్నారు.
స్వయం పాలనలో వేలాది కోట్ల రూపాయలతో కరీంనగర్ లో అభివృద్ది పనులు జోరుగా సాగుతున్నాయన్నారు . బ్రతుకు దెరువు కోసం వలస వెళ్లిన జిల్లా వాసులు సీఎం కేసీఆర్నేతృత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి తిరిగి స్వస్థలాలకు చేరుకుంటున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్ డివిజన్ కార్పొరేటర్ నేతికుంట యాదయ్య, నాంపల్లి శ్రీనివాస్, తోటరాములు, కోల సంపత్ రెడ్డి, డిష్ మధు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

