సిరిసిల్ల రూరల్, ఆగస్టు 25: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలోని కేసీఆర్నగర్కు చెందిన గోవింది సదానందం (38) నేత కార్మికుడి గా పని చేస్తున్నాడు. 3నెలల క్రితం రూ.3 లక్షల వరకు అప్పు చేసి తుంటి ఆపరేషన్ చేయించుకున్నాడు.
కోలుకున్న తరువాత ఉపాధి లేక మద్యానికి బానిసయ్యా డు. మద్యం తాగి ఇంటికి వచ్చి న సదానందాన్ని భార్య మందలించింది. మరునాడు 24న గడ్డిమందు తాగగా, దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.