హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే జిల్లాకు చెందిన అస్నాద్, పారుపల్లిని కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సర్కారు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నూరు డివిజన్ పరిధిలోకి చెన్నూరు, జైపూర్, భీమారం, కొత్తపల్లి, మందమర్రి, అస్నాద్, పారుపల్లి మండలాలను చేర్చింది. ప్రస్తుతం చెన్నూరు మండలంలో ఉన్న అస్నాద్‌ను 11 గ్రామాలతో కొత్త మండల కేంద్రంగా, కొత్తపల్లి మండలంలో ఉన్న పారుపల్లిని 19 గ్రామాలతో మండలాన్ని చేసింది.