హైదరాబాద్: జూబ్లీహిల్స్ (Jubilee hills) బాలికపై సామూహిక లైంగికదాడి ఘటనలో మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు శనివారం బాధితురాలి వీడియోలు మీడియాకు విడుదల చేయగా, ఆదివారం మరికొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. బెంజ్‌కారులో నలుగురు యువకులతో కలిసి బాధితురాలు సన్నిహితంగా ఉన్న ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో బాలిక వీడియోలను వైరల్ చేసిన పాతబస్తీకి చెందిన సుభాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టుచేశారు. వారిలో నలుగురు నిందితులు ఉన్నారు.
కాగా, బాలికపై సామూహిక లైంగిక దాడి ఇన్నోవా కారులో జరిగినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఘటనలో మరో నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో సాదుద్దీన్ మాలిక్‌తో పాటు ముగ్గురు జువైనల్స్ అరెస్టయ్యారు. పరారీలో ఉన్న మరో నిందితుడు ఉమేర్‌ఖాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇన్నోవాతో పాటు బెంజ్ కారులో పలు ఆధారాలను ఫోరెన్సిక్ అధికారులు సేకరించారు. బెంజ్‌కారులో మహిళల పెద్ద వెంట్రుకలు, షటిల్ కాక్, టేప్, శానిటైజర్లు, మాస్కులు, మహిళకు సంబంధించిన చెప్పులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నోవా కారులో లైంగిక దాడికి పాల్పడినప్పుడు సీట్లపై ఏర్పడ్డ మరకలు, పలు నమూనాలు సేకరించారు. పొడవాటి వెంట్రుకలు, సీట్లపై చేతి వేలి ముద్రలు, డోర్లపై ఉన్న వేలిముద్రలను తీసుకున్నారు.
నిందితుల్లో ఒకరు మినహా మిగతావారికి రాజకీయ కుటుంబాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి. ఒక నిందితుడు ఆటో డ్రైవర్ కొడుకు కాగా, మరో నిందితుడు ప్రభుత్వ సంస్థ చైర్మన్ కొడుకు, ఇంకో నిందితుడు సంగారెడ్డికి చెందిన ప్రజాప్రతినిధి కొడుకు, పుప్పాలగూడకు చెందిన సాదుద్దీన్ మాలిక్‌కు కుటుంబానికీ రాజకీయ సంబంధాలు ఉన్నా యి. ఇక తప్పించుకు తిరుగుతున్న ఉమేర్‌ఖాన్.. బషీర్‌బాగ్‌లోని ఒక పాత థియేటర్ యజమాని మనుమడు. వీళ్లది కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే.