హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో మంత్రికి అవమానం ఎదురైంది. ఇప్పటికే పలువురు మంత్రులకు చేదు అనుభవం ఎదురవగా.. తాజాగా మంత్రి వివేక్ సైతం ఆ జాబితాలో చేరిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా శ్రామికులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వం పలు పత్రికలకు ప్రకటనలు జారీ చేసింది.
వాటిలో సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఇతర మంత్రులెవరి ఫొటోలు లేవు. కనీసం కార్మిక శాఖ మంత్రిగా ఉన్న వివేక్ ఫొటో కూడా లేకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వంలో మంత్రులకు ఇలాంటి అవమానాలు పరిపాటిగా మారిపోయాయని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.