TG Rains | తెలంగాణ మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 5 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని వాయువ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రుతుపవన ద్రోణి జైసల్మేర్, రైసేన్, చింద్వారా, తూర్పు విదర్భ ప్రాంతంలోనున్న వాయుగుండం కేంద్రం గుండా పొరుగున ఉన్న తెలంగాణ, మచిలీపట్నం మీదుగా వెళ్తుందని.. ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉందని పేర్కొంది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే, పలుచోట్ల ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పింది. మంగళశారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ వానలు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గడిచి 24 గంటల్లో కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో 25.4, సదాశివ్‌నగర్‌లో 24, నిజామాబాద్ జిల్లా తుంపల్లిలో 22.1 సెంటీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది.
Harish Rao | ఇంట్లో వరద నీరు.. కళ్లల్లో కన్నీరు.. హరీశ్‌రావు ట్వీట్
Heavy rains | పెన్ గంగా నదికి పోటెత్తుతున్న వరద
Mahabubabad Floods | మహబూబాబాద్ జిల్లాను ముంచేసిన వరద… ఫోటోలు