ఆదిలాబాద్ : మహారాష్ట్రలో(Maharastra) కురుస్తున్న భారీ వర్షాలకు(Heavy rains) తోడు రాష్ట్రంలో సైతం భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా పెన్ గంగా(Pen Ganga) నదికి వరద పోటెత్తుతోంది. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దు ఆదిలాబాద్ జిల్లా(Adilabad Dist) జైనథ్ మండలం డొల్లారా వద్ద పెన్ గంగా ఉధృతంగా ప్రవహిస్తున్నది. బ్రిడ్జికి చేరువలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో డొల్లారా వద్ద పెన్ గంగా నది ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్సీ గౌస్ ఆలం పరిశీలించారు.
వరద పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.
పెన్ గంగాగా నది ప్రవాహాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్సీ గౌస్ ఆలం