హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రజాపాలనలో(Congress) రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వానలు రాక, పెట్టుబడి లేక, సర్కారు భరోసా కానరాక ఉన్న అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో (Nizamabad district) మరో రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి(Farmer suicide) పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన కుంట రమేష్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పులు చెల్లించాలని అప్పులు ఇచ్చిన వారు వేధిస్తున్నారంటూ బంధువులకు వాయిస్ మెసేజ్. తనకున్న ఎకరం భూమి అమ్మి అప్పులు చెల్లించాలని వాయిస్ మెసేజ్ చేశాడు. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.