జఫర్గఢ్, మే 20 : దిగబడులు రాక.. అ ప్పులు తీర్చే పరిస్థితి లేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూరులో చోటుచేసుకున్నది. కూనూరు గ్రామానికి చెందిన రొం టాల రాజిరెడ్డి(32) తనకున్న ఎకరన్నర భూ మితోపాటు ఆరున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
ఈ ఏడాది పంటల పండక సుమారు రూ.10 లక్షల వర కు అప్పులయ్యా యి. ఈ క్రమంలో మంగళవారం ఇం ట్లో ఒంటరిగా ఉన్న రాజిరెడ్డి ఉరేసుకున్నాడు. ఇంటికి వ చ్చిన భార్య గమ నించి, స్థానికులకు తెలిపింది. వారు కిందికి దింపేసరికి రాజిరెడ్డి మృతిచెందాడు. పోలీసు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.