వేలేరు, జూలై 27: సాగు దిగుబడులు రాక.. అప్పుల బాధ తీరక మనస్తాపంతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై కథనం ప్రకారం.. వేలేరు మండలం లో క్యాతండాకు చెందిన రైతు మురావత్ సాంబయ్య (34) రెండెకరాల్లో పత్తి, మక్క పంటలు సాగు చేస్తుంటాడు. వ్యవసాయానికి రూ.7 లక్షలు, కొడు కు వైద్యం కోసం మరో రూ.2 లక్షలు.. అప్పులయ్యాయి. వాటిని తీర్చే మా ర్గం కానరాక శుక్రవారం తన వ్యవసా య బావి వద్ద సాంబయ్య పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం దవాఖానకు తరలించారు. కాగా అప్పటికే సాంబయ్య మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.