వీణవంక, మే 13: వ్యవసాయంలో దిగుబడులు రాక.. అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపంతో ఓరైతు లు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల గ్రామంలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. ఘన్ముక్ల గ్రామానికి చెందిన సారేందర్రెడ్డి (53) తన రెండెకరాలతోపాటు మరో రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు.
వ్యవసాయంలో నష్టంరావడంతో రూ.5 లక్షల వరకు అప్పులయ్యా యి. అప్పులబాధ భరించలేక తీవ్రమైన మనోవేదనకు గురై, మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబీకులు వరంగల్ ఎంజీఎంకు తరలించగా, చికిత్సపొందుతూ మృతిచెందాడు. సారేందర్రెడ్డి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్హెచ్వో సాయికృష్ణ తెలిపారు.