కాశీబుగ్గ, మే 8 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో మరో మిర్చి వ్యాపారి రూ.6 కోట్లు ఐపీ పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇటీవల లాడె తిరుపతి అనే మిర్చి వ్యాపారి అడ్తిదారులకు రూ.3కోట్ల వరకు ఎగనామం పెట్టిన విషయం తెలిసిందే.
నెల రోజులు గడవకముందే మరో వ్యాపారి రూ.6కోట్లకు టోకరా పెట్టాడు. దీంతో అడ్తిదారుల గుండెల్లో బాంబు పేలినట్లుయింది. వెంటనే చాంబర్ అధ్యక్షుడు.. బాధిత అడ్తి వ్యాపారుల బాకీల వివరాలను సేకరిస్తున్నట్టు తెలిసింది. సంబంధిత మిర్చి వ్యాపారి పది రోజుల నుంచి అందుబాటులో లేడని తెలిసింది.